Site icon NTV Telugu

Meera Chopra: అప్పుడు ఫిర్యాదు చేసిన బీజేపీకి పవన్ హీరోయిన్ మద్దతు

Meera Chopra

Meera Chopra

Meera Chopra Slams Those Blaming BJP For Communal Violence In Haryana: బంగారం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో తమిళ సినీ పరిశ్రమకి కోలీవుడ్ కు మాకాం మార్చిన ఈ బ్యూటీ గతంలో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా మళ్ళీ తెలుగు వారిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె కొన్నాళ్ల క్రితం ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ చేయగా అందులో ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో మహారాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడ్డారు. అంతేకాదు ఇది ఫేక్ ఐడీ అని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు థానే మున్సిపల్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను అప్పట్లోనే మీరా చోప్రా కొట్టిపారేసింది.

Naga Chaitanya: రియల్ ఇన్సిడెంట్స్ తో చైతూ-చందూ సినిమా… అతని జీవితం ఆధారంగానే?

సోషల్ మీడియాలో తన పేరిట ప్రచారంలో ఉన్న ఐడీ కార్డు తనది కాదని, ఇలాంటి చర్యలకు తాను వ్యతిరేకం అని పేర్కొంది. అయితే ఒకప్పుడు తన మీద ఫిర్యాదు చేసిన బీజేపీని ఇప్పుడు ఆమె వెనకేసుకు వచ్చింది. ప్రియాంక చోప్రా కజిన్ అయిన ఆమె తాజాగా హర్యానాలో హింసాకాండపై స్పందించారు. అంతేకాక మత ఘర్షణలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని ‘నిందించే’ వారిపై ఆమె మండిపడ్డారు. ఇటలీ, ఫ్రాన్స్ వంటి ఇతర దేశాల్లో జరుగుతున్న హింసకు కూడా బీజేపీనే కారణమా అని ఆమె ప్రశ్నించారు. గురువారం (ఆగస్టు 3) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మీరా “భారతదేశంలో జరుగుతున్న మత హింసకు బీజేపీని చాలా మంది నిందించడం నాకు అర్థమైంది, నేను అదే వ్యక్తులను అడగాలనుకుంటున్నాను, లండన్‌లో, ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ మరియు ఇతర ప్రదేశాలలో జరుగుతున్న మత హింసకు కారణాలు ఏంటి ఇవి కూడా బీజేపీ పాలించే దేశాలేనా?? అని ఆమె ప్రశ్నించింది.

Exit mobile version