Site icon NTV Telugu

Sushanth Meenakshi : ఎయిర్‌పోర్ట్‌లో.. సుశాంత్‌తో మీనాక్షి చౌదరి క్లోజ్ మోమెంట్స్ వైరల్

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి చుట్టూ ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక అక్కినేని హీరోతో ప్రేమలో ఉందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాకు చెందిన మీనాక్షి మోడలింగ్‌ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చదువులో టాపర్‌గా, డాక్టర్‌గా అర్హత సాధించడంతో పాటు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో మెరిసిన మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఆమె. 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Also Read : Maa Behen : మా బెహెన్‌లో.. త్రిప్తి దిమ్రికి తల్లిగా బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్

ఆ తర్వాత ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, మట్కా వంటి సినిమాల్లో నటించింది. కానీ నిజమైన బ్రేక్ ఇచ్చింది లక్కీ భాస్కర్. ఆ సినిమా తర్వాత మీనాక్షి స్టార్ హీరోయిన్ రేసులో ముందుకు దూసుకెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య సరసన NC 24లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో మీనాక్షి డేటింగ్‌లో ఉందన్న రూమర్స్ చాలాకాలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా సమయంలోనే ఈ గుసగుసలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఆ వార్తలకు మరింత ఊపిరి పోసింది. మీనాక్షి మాస్క్‌తో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని నడుస్తుండగా, సుశాంత్ లగేజ్ ట్రాలీతో వెంబడి రావడం వీడియోలో రికార్డ్ అయ్యింది. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇంతకు ముందు మీనాక్షి ఈ రూమర్స్‌పై స్పందించారు కూడా. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, అంతకు మించి ఎలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ, మళ్లీ మళ్లీ వీరి పేర్లు గాసిప్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా..? లేక కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనా..? అన్నది వీరిద్దరి రియాక్షన్ రాకముందు చెప్పలేం.

Exit mobile version