Sushanth Meenakshi : ఎయిర్‌పోర్ట్‌లో.. సుశాంత్‌తో మీనాక్షి చౌదరి క్లోజ్ మోమెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి చుట్టూ ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక అక్కినేని హీరోతో ప్రేమలో ఉందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాకు చెందిన మీనాక్షి మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చదువులో టాపర్‌గా, డాక్టర్‌గా అర్హత సాధించడంతో పాటు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో మెరిసిన మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఆమె. 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Also Read : Maa Behen : మా బెహెన్‌లో.. త్రిప్తి దిమ్రికి తల్లిగా బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్
Also Read
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ఆ తర్వాత ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, మట్కా వంటి సినిమాల్లో నటించింది. కానీ నిజమైన బ్రేక్ ఇచ్చింది లక్కీ భాస్కర్. ఆ సినిమా తర్వాత మీనాక్షి స్టార్ హీరోయిన్ రేసులో ముందుకు దూసుకెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య సరసన NC 24లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో మీనాక్షి డేటింగ్‌లో ఉందన్న రూమర్స్ చాలాకాలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా సమయంలోనే ఈ గుసగుసలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఆ వార్తలకు మరింత ఊపిరి పోసింది. మీనాక్షి మాస్క్‌తో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని నడుస్తుండగా, సుశాంత్ లగేజ్ ట్రాలీతో వెంబడి రావడం వీడియోలో రికార్డ్ అయ్యింది. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇంతకు ముందు మీనాక్షి ఈ రూమర్స్‌పై స్పందించారు కూడా. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, అంతకు మించి ఎలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ, మళ్లీ మళ్లీ వీరి పేర్లు గాసిప్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా..? లేక కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనా..? అన్నది వీరిద్దరి రియాక్షన్ రాకముందు చెప్పలేం.
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్‌ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!