Site icon NTV Telugu

Gunturu Kaaram: బ్రేకింగ్.. పూజా ప్లేస్ లో మీనాక్షి..?

Mahesh

Mahesh

Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అసలు ఎవరు వస్తున్నారు.. ఎవరిని తీసేస్తున్నారు..? ఎందుకు తీసేస్తున్నారు..? అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అవుట్ అంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత థమన్ తో పాటు పూజా హెగ్డే కూడా అవుట్ అంటూ పుకార్లు పుట్టాయి. ఇక అది అయ్యేలోపు థమన్ ఇన్.. పూజా అవుట్ అంటూ మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమెను ఎందుకు తీసేసారు..అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇక్కడ నుంచి పుకార్లు షికార్లు చేస్తూనే వస్తున్నాయి. శ్రీలీల వలనే పూజా వెళ్లిపోయిందని కొందరు. పూజా ప్లేస్ లో సంయుక్త మీనన్ వస్తుందని మరికొందరు. పూజా నటన నచ్చక త్రివిక్రమ్ తీసేశాడని ఇంకొందరు రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. అసలు ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఎవ్వరికీ తెలియదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా గుంటూరు కారం సినిమాకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం

Chiranjeevi: హిట్ పడడం ఆలస్యం.. మెగాస్టార్ లాగేస్తున్నాడు..?

ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో మీనాక్షి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా అవకాశాలు మాత్రం బాగానే అందించింది. ఖిలాడీ చిత్రంలో రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అది కూడా అమ్మడికి హిట్ ను ఇవ్వలేకపోయింది. ఇక దీని తరువాత హిట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో ముద్దుగుమ్మ కొద్దోగొప్పో హిట్ ను అందుకుంది. ఫేమస్ అవ్వాలంటే హిట్స్ యే అందుకోవాలా.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే చాలు. మీనాక్షి ఇన్స్టాగ్రామ్ తోనే మరింత ఫేమస్ అయ్యింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోయిన ఈ భామ ట్యాలెంట్ ఇన్నాళ్లకు త్రివిక్రమ కంట పడింది. ఎట్టకేలకు మహేష్ సరసన నటించే ఛాన్స్ పట్టేసింది. మరి ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ దశ తిరుగుతుందేమో చూడాలి.

Exit mobile version