Meena: పరిగెత్తుకుంటూ వెళ్లి ముద్దు పెడితే.. వెంకటేష్ భయపడ్డాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meena: సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే నాగేశ్వరరావు తో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అలా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సాగర్ ను వివాహమాడి సినిమాలకు కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చింది. మీనా కు ఒక పాప. తనలానే తన కూతురును కూడా బాలనటిగా మార్చింది. ఇక గతేడాది మీనా జీవితంలో మర్చిపోలేని విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఆమె భర్త సాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక భర్త చనిపోయాక ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని తట్టుకొని.. కూతురు కోసం మళ్ళీ నటించడం మొదలుపెట్టింది.
తాజాగా మీనా జడ్జిగా కూడా మారింది. సెలబ్రిటీ రీల్ వర్సెస్ రియల్ కపుల్స్ తో జీ తెలుగులో సూపర్ జోడీ అనే డ్యాన్స్ షో మొదలయ్యింది. హీరోయిన్ శ్రీదేవి, మీనా, రఘు మాస్టర్ జడ్జి ల్లా వ్యవహరిస్తున్న ఈ షో కు ఉదయభాను యాంకర్ గా వ్యవహరిస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ డ్యాన్స్ షో సక్సెస్ ఫుల్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ స్టేజిపై మీనా నటించిన చంటి సినిమాలోని ఎన్నెన్నో అందాలు సాంగ్ ను రీక్రియేట్ చేశారు. దీంతో మీనా అప్పటి రోజులను గుర్తుచేసుకుంది. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. 1991 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక క్లైమాక్స్ లో మీనా గాజు ముక్కలపై పరిగెడుతూ వచ్చి వెంకటేష్ ను ముద్దుపెట్టుకుంటుంది. తాను అలా పరిగెత్తుకుంటూ వెళ్లి ముద్దు పెట్టేసరికి వెంకటేష్ భయపడ్డాడని మీనా చెప్పుకొచ్చింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, మీనా ఎన్నో సినిమాలు చేశారు. ఇండస్ట్రీలో హిట్ పెయిర్ లిస్ట్ లో వీరి జంట కూడా ఒకటి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!