Site icon NTV Telugu

Meena : విడాకులు తీసుకున్న వాళ్లందరితో నాకు పెళ్లి చేసేశారు..

Meena

Meena

Meena : సీనియర్ హీరోయిన్ మీనా భర్త చనిపోయిన తర్వాత ఆమెపై చాలా రూమర్లు వచ్చాయి. పలానా వ్యక్తితో పెళ్లి అని.. ఆమె కోసమే ఆ నటుడు విడాకులు తీసుకున్నాడని.. ఇలా లెక్కలేనన్ని క్రియేట్ అయ్యాయి. కానీ వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు మీనా గెస్ట్ గా వచ్చింది. ఈ షో గురించి ఆమె చాలా విషయాలను పంచుకుంది. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు ప్లాపులు ఉంటే తక్కువ రెమ్యునరేషన్ కోసం నాతో సినిమాలు చేసేవారు. ఒకవేళ ఆ సినిమాలు హిట్ అయితే మళ్లీ నన్ను పట్టించుకునే వారు కాదు. అది చాలా బాధగా అనిపించేది. చాలా మంది నిర్మాతలు అలాగే చేసేవారు. ఇక నా భర్త చనిపోయిన తర్వాత నాపై రకరకాల ప్రచారాలు చేసేశారు. మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే చాలా బాధేసేది.

Read Also : Mirai : ప్రభాస్ వాయిస్ ఓవర్ రహస్యాన్ని చెప్పిన డైరెక్టర్

నేను రెండో పెళ్లి చేసుకుంటానని రాసేవాళ్లు. వాళ్లకు కుటుంబాలు లేవా. ఎందుకు అలా రాసేవారో నాకు అర్థం కాలేదు. ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా సరే వారితో నాకు పెళ్లి అంటూ రాసేవాళ్లు. అలా ఎంతో మందితో నాకు పెళ్లి చేసేవాళ్లు మీడియా వారు. అవేవీ నిజం కాదని నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ అలాంటి రూమర్లు నా మీద ఆగట్లేదు. నాకు అవి చాలా బాధగా అనిపిస్తోంది. నా భర్త లేకపోతే నాపై ఇలాంటి వార్తలు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు అంటూ తెలిపింది మీనా. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీనా దృశ్యం సినిమాతో బాగా పాపులర్ అయింది. దాని తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. మాడ్రన్ తల్లి పాత్రలు కూడా చేస్తోంది.

Read Also : OG : సుజీత్ కు అగ్నిపరీక్ష.. పవన్ మీదే ఆశలు..

Exit mobile version