NFDC: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి.) చీఫ్ గానే కాకుండా 2021 డిసెంబర్ నుండి నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి.) మేనేజింగ్ డైరెక్టర్ గా, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ సి.ఇ.వో.గా, ఫిల్మ్ డివిజన్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలను నిర్వస్తున్న రవీందర్ భాకర్ బాధ్యతలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ కుదించింది. ప్రస్తుతం మంత్రిత్వశాఖ లో జాయింట్ సెక్రటరీ (ఫిల్మ్స్)గా ఉన్న పృథుల్ కుమార్ ను ఎన్.ఎఫ్.డి.సి. తాత్కాలిక కార్యనిర్వహణాధికారిగా నియమించింది. ఆ మేరకు ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవీందర్ భాకర్ ను సి.బి.ఎఫ్.సి. చీఫ్ గా మాత్రం కొనసాగిస్తోంది. గత నెలలో కేంద్ర మంత్రిత్వ శాఖ తన పరిధిలోని ఫిల్మ్ డివిజన్, నేషనల్ ఫిల్మ్ ఆర్క్వీస్ ఆఫ్ ఇండియా, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఎన్.ఎఫ్.డి.సి.లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాటిని ఏకత్రాటిపైకి తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు పృథుల్ కుమార్ కు వాటి బాధ్యతలను అప్పగించింది. మరో ఆరు నెలల్లో ఎన్.ఎఫ్.డి.సి.కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ను నియమించే వరకూ ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు.
California Storm: తుఫాన్ బీభత్సం.. కాలిఫోర్నియా అతలాకుతలం.. 19 మంది మృతి
ఎన్.ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ రవీందర్ భాకర్ నేతృత్వంలోనే గత యేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆ కార్యక్రమం ముగింపు ఉత్సవంలో జ్యూరీ సభ్యుడైన ఇజ్రాయల్ ఫిల్మ్ మేకర్ నడల్ లఫిడ్ ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని బాహాటంగా విమర్శించాడు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ఆ సమయంలో అదే వేదికపై ఉన్నారు. రవీందర్ భాకర్ బాధ్యతలను కుదించడానికి ఈ సంఘటన కూడా ఓ కారణమనే మాట వినిపిస్తోంది. కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఎన్.ఎఫ్.డి.సి.కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ను నియమించింది. సి.బి.ఎఫ్.సి. ఛీఫ్ రవీందర్ భాకర్ ఇప్పటి వరకూ నిర్వర్తిస్తున్న ఈ అదనపు బాధ్యతలను పృధుల్ కుమార్ కు అప్పగించింది.
Chandrababu Go Back Flexis: సైకో చంద్రబాబు గో బ్యాక్.. పీలేరులో ఫ్లెక్సీలు..
