Mayapetika Trailer: విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాయాపేటిక. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా జూన్ 30 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఈ సినిమా అంతా ఒక ఫోన్ చుట్టూనే తిరుగుతుందని అర్ధమవుతుంది. ఇందులో పాయల్.. హీరోయిన్ గానే కనిపించింది. ” ఈ ప్రపంచంలో మనిషికి నాలుగు అవసరాలు ఉంటాయి.. ప్రేమ, పవర్, డబ్బు.. నేను” అంటూ ఒక ఫోన్.. ఈ సినిమా కథను చెప్పుకు రావడంతో ట్రైలర్ మొదలవుతుంది. నువ్వేమైనా పతివ్రతను పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా.. హీరోయిన్ ను చేసుకున్నావని చెప్పడం ఆకట్టుకుంటుంది.
Shriya Sharan: శ్రియ కూతురును చూశారా.. అప్పుడే అంత పెద్దది అయ్యిందా.. ?
నాలుగు కథలు.. నాలుగు కుటుంబాలు.. ఈ నాలుగు అవసరాలతో నిండి ఉంటాయి. ఒకరికి ప్రేమ కావాలి.. ఇంకొకరికి పదవి.. మరొకరికి డబ్బు.. ఇంకో కుటుంబానికి ఫోన్.. ఇలా ఈ నాలుగు కథలను ఒక ఫోన్ కు కనెక్ట్ చేశారు. ఆ ఒక్క ఫోన్ చేతులు మారుతూ ఉండటాన్ని చూపించారు. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల వారి జీవితాలు తలకిందులుగా ఎలా మారిందనే విషయాన్ని కూడా చూపించారు. అసలు ఆ ఫోన్ ఎవరిది.. అందులో ఏముంది.? దానివలన వీరి జీవితాలు ఎలా మారాయి అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఒక సస్పెన్స్ కథగా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. ఇకపోతే ఈ సినిమాకు సంగీతం గుణ బాల సుబ్రహ్మణ్యం అందించాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకోనున్నదో చూడాలంటే జూన్ 30 వరకు ఆగాల్సిందే.
