NTV Telugu Site icon

MayaBazaar For Sale: రియల్ మోసం.. అడ్డంగా ఇరుక్కున్న నవదీప్

Maya

Maya

MayaBazaar For Sale: ఈ మధ్య ఓటిటీ కంటెంట్ చాలా యూనిక్ గా ఉంటుంది. థియేటర్ లో వచ్చే సినిమాలకంటే.. ఓటిటీ లో ఒరిజినల్స్ గా రిలీజ్ అవుతున్న సినిమాలే మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇక తాజాగా జీ5 మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏనియర్ నటుడు నరేష్, ఈషా రెబ్బ, నవదీప్.. ప్రధానపాత్రల్లో నటించిన సినిమా మాయాబజార్ ఫర్ సేల్. గౌతమి చల్లగుళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ రంజన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ మొత్తాన్ని కామెడీతో నింపేశారు.

Mrunal Thakur: సీతా.. సినిమాలోనే కాదు బయట కూడా బ్రేకప్ అయ్యిందా.. ఎవరా కుర్రాడు..?

నరేష్.. ఒక మధ్యతరగతి వ్యక్తి. మాయాబజార్ అనే సౌత్ ఇండియన్ గేటెడ్ కమ్యూనిటీ లో చాలా డబ్బు పోసి విల్లా తీసుకుంటాడు. ఆ విల్లా తీసుకుంటే.. కూతురు ఈషా రెబ్బకు మంచి సంబంధాలు వస్తాయని అనుకుంటాడు. అయితే ఈషా.. ఒక చైనీస్ వ్యక్తిని ఇష్టపడుతుంది. ఇక ఈ మాయాబజార్ అనే సౌత్ ఇండియన్ గేటెడ్ కమ్యూనిటీకి బ్రాండ్ అంబాసిడర్ గా నవదీప్ కనిపించాడు. ఆ కమ్యూనిటీలో ఉన్న ఒక్కో ఫ్యామిలీ ఎలా ఉంటారో ట్రైలర్ లో చూపించారు. ఇక అంతా బావుంది అనుకొనేలోపు.. ఆ కమ్యూనిటీ కట్టింది అంతా ఇల్లీగల్ స్థలంలో అని బయటపడుతుంది. దీంతో నవదీప్ చిక్కుల్లో పడతాడు. హీరోగా మీడియా ముందు కబ్జా చేసిన స్థలంలో కట్టిన ఇళ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారతాడు. లీగల్ నోటీసులు అందుకొని పరువు పోగొట్టుకుంటాడు. ఇక మరోపక్క విషయం తెల్సిన నరేష్. ఆ ఇల్లును వదిలించుకొని.. తాను కట్టిన డబ్బును వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రభుత్వం .. మాయాబజార్ ను కూల్చడానికి ఉత్తర్వలు జారీ చేస్తుంది. మరి.. వీరందరూ ఎలా ఆ చిక్కులో నుంచి బయటపడ్డారు. అసలు మాయాబజార్ లో ఏం జరిగింది.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Show comments