ఏడేళ్ళ తర్వాత ఓంకార్ ‘మాయాద్వీపం’లోకి మరోసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీజే గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత పలు పాపులర్ షోస్ ను నిర్వహించాడు ఓంకార్. అంతేకాదు… ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ నూ ఏర్పాటు చేశాడు. ఓంకార్ నిర్వహించిన ఆట, ఛాలెంజ్, అదృష్టం, సిక్స్త్ సెన్స్ వంటి కార్యక్రమాలు అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ మధ్యలో దర్శక నిర్మాతగానూ ఓంకార్ కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అయితే… ఓంకార్ నిర్వహించిన కిడ్స్ రియాలిటీ షో ‘మాయాద్వీపం’ అతని కెరీర్ లోనే సమ్ థింగ్ స్పెషల్! పిల్లలను ఆకట్టుకోవడంతో పాటు పెద్దలనూ ఎంటర్ టైన్ చేసేలా ఆ రియాలిటీ షో సాగింది.
2007లో మొదలైన ‘మాయా ద్వీపం’ రియాలిటీ షో… తొలిసారి మూడేళ్ళు, ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత రెండేళ్ళు కొనసాగింది. ఇప్పుడు ఆ సూపర్ హిట్ రియాలిటీ షోను మరోసారి ఈ తరం బాలబాలికల కోసం తీసుకొస్తున్నారు ఓంకార్. జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ఈ షో కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. అద్భుత దీపం కోసం కొందరు పిల్లలు ఓ పురాతన భవనంలోకి వెళతాడు. భయంకరమైన ఆ భవనంలో వారికి ఓ డిఫరెంట్ గెటప్ లో ఓంకార్ కనిపిస్తాడు. ‘అద్భుత దీపం’ కోసం వెతకాల్సింది ఇక్కడ కాదని ‘మాయద్వీపం’లో అని చెబుతాడు. సో… ఈ పిల్లలంతా ఆ ‘మాయాద్వీపం’ లోకి వెళ్ళి, అక్కడ ఎలా అద్భుత దీపం ను పొందారన్నదే ఈ షో కాన్సెప్ట్ అనేది చెప్పకనే చెప్పేశారు. ఈ షో టెలికాస్ట్ డేట్ ను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే ‘సిక్త్స్ సెన్స్’తో బుల్లితెర వీక్షకులను మరోసారి తనవైపు తిప్పుకున్న ఓంకార్… ఈ ‘మాయాద్వీపం’తో చిన్నారులనూ ఆకట్టుకునే పనిలో పడ్డాడు!
Also Read
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
తాజావార్తలు
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?