Maya Bazaar For Sale Crosses 100 Million Streaming Minutes: జీ 5 లో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్ ‘మాయాబజార్ ఫర్ సేల్’. సీనియర్ నరేష్, నవదీప్, ఈషా రెబ్బా, హరి తేజ, రవివర్మ, తరుణ్ భాస్కర్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ సంపాదించింది. సెటైరికల్ డ్రామాగా ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ రూపొందగా జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను డిజైన్ చేశారు. ‘మాయాబజార్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ను గౌతమి చిల్లగుల్ల దర్శకత్వంలో తెరకెక్కించారు. గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన ఈ వెబ్ ఒరిజినల్ జీ5లో ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తూ ఇప్పుడు అయితే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది.
Shreya Dhanwanthary: రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు!
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’కు అమేజింగ్ రెస్పాన్స్ రావటంపై టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారందరూ ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకుంటారు కానీ అదే టైమ్‌లో వారి గేటెడ్ కమ్యూనిటీని అనధికారికంగా నిర్మించినట్లుగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తుంది. ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్స్ కూడా వచ్చిన తరువాత ఏం జరిగిందనే దానిని ఆసక్తిగా తెరకెక్కించారు. ప్రత్యేకించి మోడరన్ సొసైటీలో ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి? సామాజిక జీవన విధానం ఎలా ఉంటుంది అనే కోణంలో సెటైరికల్ కామెడీగా ఈ సిరీస్ తెరకెక్కించారు.