Site icon NTV Telugu

Mastiii 4 Trailer: మళ్లీ మస్తీ మోడ్‌లో.. రితీశ్‌ దేశ్‌ముఖ్ ‘మస్తీ 4’ ట్రైలర్‌ రిలీజ్‌

Masthi 4

Masthi 4

బాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజీలలో ప్రేక్షకులను బాగా అలరించిన సిరీస్‌ “మస్తీ”. ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాలు మంచి నవ్వులు పంచగా, ఇప్పుడు అదే సిరీస్‌కి నాలుగో చాప్టర్‌ సిద్ధమైంది. తాజాగా విడుదలైన “మస్తీ 4” ట్రైలర్‌తో సినిమా పై భారీ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. హీరోలు రితీశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని ఈసారి కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెండ్‌షిప్‌, రిలేషన్‌షిప్‌ల మధ్య జరిగే కామెడీ కన్ఫ్యూజన్స్‌, మిస్అండర్‌స్టాండింగ్స్‌ను చూపించే విధంగా ట్రైలర్‌ మజాగా కట్‌ చేశారు.

Also Read : SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి కాంబో సెన్సేషన్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..!

సినిమాకి మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వం వహించగా, మునుపటి భాగాల కంటే మరింత హాస్యం, మసాలా, ఎమోషనల్ కలిపి ఈసారి “మస్తీ 4”ను రూపొందించినట్లు టీమ్ తెలిపింది. నవంబర్ 24న సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ సిరీస్‌కి ఉన్న లెగసీ కారణంగా, ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. రితీశ్ – వివేక్ జంట మళ్లీ తెరపై కనిపించడం కామెడీ లవర్స్‌కి పండగలాంటిదే. మొత్తం మీద, “మస్తీ 4” ట్రైలర్‌తోనే ఫుల్ ఫన్ గ్యారంటీ అని చెప్పవచ్చు!

 

Exit mobile version