Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది.
Also Read : Ghaati : అనుష్క ‘ఘాటీ’ ఏప్రిల్ విడుదల డౌటే.?
Also Read
అయితే ఆదివారం తెల్లవారుజామున వన్మయి గదిలో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఆమె రూమ్ లోని ఆల్మారాలను పరిశీలించింది. అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వన్మయి ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు. కరాటే రాజు ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తెల్లవారుజామున 5. 50 నిమిషాల ప్రాంతంలో.. ఒక గుర్తుతెలియని వ్యక్తి బైక్ మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇంటి గేటు తీసుకుని డైరెక్టుగా మూడో అంతస్తుకు వెళ్లాడని, వెనుక డోర్ నుంచి విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్‌రూంలోకి వెళ్లి.. అల్మరాలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?