The Great Pre Wedding Show: దుమురేపుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్.. థియేటర్స్‌లో కలెక్షన్స్ సునామీ!
- దుమురేపుతున్న 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్
- థియేటర్స్‌లో కలెక్షన్స్ సునామీ
- తిరువీర్ హావభావాలు, డైలాగ్ డెలివరీ అద్భుతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థ్రిల్లర్ మూవీ ‘మసూద’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టీనా శ్రావ్య హీరోయిన్గా నటించారు. నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతూ.. బాక్సఫీస్ వద్ద దూసుకెళుతోంది. 3 రోజులకు 1.33 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి అదరగొడుతోంది. ఈ చిన్న సినిమా లిమిటెడ్ స్క్రీన్లలో రిలీజ్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1.60 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఆడియన్స్ థియేటర్స్‌లో ఫ్యామిలీతో కలిసి చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో టాలీవుడ్లో వచ్చిన ది బెస్ట్ కామెడీ సినిమాగా ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షోగా చెబుతున్నారు. ఎటువంటి బూతులు లేకుండా సహజమైన కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ముఖ్యంగా హీరో తిరువీర్ తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. తిరువీర్ హావభావాలు, డైలాగ్ డెలివరీ అద్భుతం. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కథనం, శ్రీకాకుళం కామెడీ ప్రేక్షకులను థియేటర్లలో తెగ ఆకట్టుకుంటున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరు చెప్పేది ఒకటే.. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అని. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడే వస్తుంటాయని, తప్పకుండా థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అని ఫాన్స్ అంటున్నారు.
Also Read
- Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి... చేసేదంతా దర్శకులే... 'పెద్ది' వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
- NTRNEEL : ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
- Samantha Ruth Prabhu : 'మా ఇంటి బంగారం' హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
- Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్... ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
Also Read: Foldable Phones: ఫోల్డబుల్ ఫోన్లు కొంటున్నారా?.. అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్లే ఎక్కువ!
శనివారం చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా.. సినిమా విజయం పట్ల తిరువీర్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమాకి ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా కనిపించలేదని, బ్లాక్ బస్టర్ ఫన్ షో అని పేర్కొన్నారు. చాలా రోజులకి తాను హ్యాపీగా ఉన్నానని ఆనందం వ్యక్తం చేశారు. ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమాకి బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జీ5 రూ.3 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే ఈ డీల్ కుదిరిందట. రిలీజ్ అయ్యాక డీల్ అయితే ఇంకా ఎక్కువ మొత్తం పలికేది. ఏదేమైనా అటు బాక్సఫీస్ కలెక్షన్స్, ఇటు ఓటీటీ డీల్‌తో ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షోపై కాసుల వర్షం కురుస్తోంది.
తాజావార్తలు
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!