Site icon NTV Telugu

The Great Pre Wedding Show: దుమురేపుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్.. థియేటర్స్‌లో కలెక్షన్స్ సునామీ!

The Great Pre Wedding Show

The Great Pre Wedding Show

థ్రిల్లర్ మూవీ ‘మసూద’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించారు. నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతూ.. బాక్సఫీస్ వద్ద దూసుకెళుతోంది. 3 రోజులకు 1.33 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి అదరగొడుతోంది. ఈ చిన్న సినిమా లిమిటెడ్ స్క్రీన్‌లలో రిలీజ్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1.60 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఆడియన్స్ థియేటర్స్‌లో ఫ్యామిలీతో కలిసి చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వచ్చిన ది బెస్ట్ కామెడీ సినిమాగా ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షోగా చెబుతున్నారు. ఎటువంటి బూతులు లేకుండా సహజమైన కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ⁠ముఖ్యంగా హీరో తిరువీర్ తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. తిరువీర్ హావభావాలు, డైలాగ్ డెలివరీ అద్భుతం. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కథనం, శ్రీకాకుళం కామెడీ ప్రేక్షకులను థియేటర్లలో తెగ ఆకట్టుకుంటున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరు చెప్పేది ఒకటే.. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని. ⁠ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడే వస్తుంటాయని, తప్పకుండా థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అని ఫాన్స్ అంటున్నారు.

Also Read: Foldable Phones: ఫోల్డబుల్ ఫోన్‌లు కొంటున్నారా?.. అడ్వాంటేజ్‌ కంటే డిసడ్వాంటేజ్‌లే ఎక్కువ!

శనివారం చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా.. సినిమా విజయం పట్ల తిరువీర్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమాకి ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా కనిపించలేదని, బ్లాక్ బస్టర్ ఫన్ షో అని పేర్కొన్నారు. చాలా రోజులకి తాను హ్యాపీగా ఉన్నానని ఆనందం వ్యక్తం చేశారు. ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమాకి బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జీ5 రూ.3 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే ఈ డీల్ కుదిరిందట. రిలీజ్ అయ్యాక డీల్ అయితే ఇంకా ఎక్కువ మొత్తం పలికేది. ఏదేమైనా అటు బాక్సఫీస్ కలెక్షన్స్, ఇటు ఓటీటీ డీల్‌తో ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షోపై కాసుల వర్షం కురుస్తోంది.

Exit mobile version