Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించ బోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదల కాబోతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సాంగ్ గురించి ట్వీట్ చేశారు. ”ఇప్పుడే ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సాంగ్ ని చూశాను. మెగాస్టార్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగల్ ఈ వారమే విడుదలౌతుంది. పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ” అని ట్వీట్ చేశారు.
‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదే పాటని ఈ వారం విడుదల చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి- దేవిశ్రీ ప్రసాద్ లది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలు మ్యజికల్ గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇటివలే విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ వింటేజ్ అవతార్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ మాస్ పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతీహాసన్ నాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
