Site icon NTV Telugu

Veera Simha Reddy: డోస్ పెంచి మాస్ మొగుడు వచ్చేస్తున్నాడు…

Veera Simha Reddy

Veera Simha Reddy

గాడ్ ఆఫ్ మాసెస్… నందమూరి నటసింహం బాలకృష్ణ కాస్త ఎక్స్ ట్రా డోస్ తో జనవరి 3న ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. బాలయ్య నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా నుంచి ‘మాస్ మొగుడు’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇచ్చారు. బాలకృష్ణ-శృతి హాసన్ లు ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసి, జనవరి మూడున సాయంత్రం 7:55 నిమిషాలకి ‘మాస్ మొగుడు’ సాంగ్ బయటకి వస్తుందని చెప్పేశారు. ఇప్పటికే వీర సింహా రెడ్డి సినిమా నుంచి బయటకి వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యి, యుట్యూబ్ ని షేక్ చేశాయి. ఈ ‘మాస్ మొగుడు’ సాంగ్ కూడా వచ్చేస్తే తమన్, బాలకృష్ణల ఖాతాలో మరో హిట్ సాంగ్ చేరినట్లు అవుతుంది. రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్, తమన్ ఇచ్చిన ‘మాస్ బీట్’ ఈ ‘మాస్ మొగుడు’ సాంగ్ ని నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చేలా మార్చిందట.

https://twitter.com/MythriOfficial/status/1609483610545098752

ఇదిలా ఉంటే న్యూ ఇయర్ రోజున నందమూరి అభిమానులకి కిక్ ఇస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ ని బయటకి వదిలాడు. ఈ [పోస్టర్ తో బాలయ్య, ఒక పెద్ద సింహం పక్కన నిలబడి ఉన్నాడు. సింహం స్టాట్యూ పక్కన నటసింహం నిలబడింది అంటూ నందమూరి అభిమానులు, ఈ కొత్త పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు నుంచి బాలయ్యకి పెద్ద ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని, తన ఫేవరేట్ హీరోని ఎలా చూపిస్తాడో? ఎలాంటి వింటేజ్ స్టఫ్ ని ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇస్తాడో చూడాలి. జనవరి 12న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్ కి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్ లో ఉన్న నందమూరి అభిమానులు ‘వీర సింహా రెడ్డి’ సినిమాని చూడడానికి టికెట్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చెయ్యడంతో ప్రీమియర్ షో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

Exit mobile version