Site icon NTV Telugu

Mass Maharaja Raviteja: అస్సలు నేను సినిమా ఒప్పుకున్నదే అతడి కోసం ..

raviteja

raviteja

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఏ స్టూడియోస్ మరియు పెన్ మూవీస్  సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ” కరోనా సమయం కాబట్టి చాలా తక్కువ మంది కలిసాం.. ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం.. ఇక సినిమా విషయానికొస్తే నన్ను ఇంత అందంగా చూపించినవారికి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా యాక్షన్ కింగ్ అర్జున్ ఆయన నటనకు నేను ఫిదా అయిపోయాను.

ఇక నేను జాతకాలను, అదృష్టాలను నమ్మను.. కానీ రమేష్ వర్మ విషాయంలో మాత్రం దీనిని పక్క నమ్ముతాను. ఆయన అదృష్టం ఏంటంటే నిర్మాత కోనేరు సత్యనారాయణ దొరకడం.. ప్రతి టెక్నీషియన్ ని వెతికి పట్టుకొని అందించారు. ఇక హీరోయిన్లు గురించి చెప్పాలంటే.. డింపుల్ హయతి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాచ్ మీ సాంగ్ లో అదరగొట్టేసింది. మీనాక్షి తో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఈ ఇద్దరు హీరోయిన్లు భవిష్యత్తులో మంచి స్టార్లు అవుతారు. ఇక నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక కారణం శ్రీకాంత్ విస్సా .. ఇతని వలనే నేను సినిమా ఒప్పుకున్నాను. ఇతను స్టోరీ చెప్పిన విధానం, డైలాగులు అన్ని రేపు మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. శ్రీకాంత్ తో ఇప్పుడే నా జర్నీ మొదలయ్యింది. ముందు ముందు మేము ఇంకా సినిమాలు చేస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.

https://www.youtube.com/watch?v=lZWe2QWWrKE
Exit mobile version