మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీమని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇవ్వడం, రావణాసుర టీజర్ ని సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లడానికి మేకర్స్ రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మార్చ్ 28న సాయంత్రం 4:05 నిమిషాలకి రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు.
బ్యాక్ గ్రౌండ్ లో మంటల్లో కాలుతున్న ముద్దాయి బోను, న్యాయ దేవత, ఫోర్ గ్రౌండ్ లో గన్ పట్టుకోని సీరియస్ గా చూస్తున్న రవితేజ ఈ పోస్టర్ లో కనిపించారు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో రావణాసుర సినిమా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ సినిమా అని ప్రూవ్ చేస్తూ వస్తున్న మేకర్స్ మరోసారి ఈ కొత్త పోస్టర్ తో కూడా అలాంటి ఫీల్ నే ఇచ్చారు. మర ట్రైలర్ తో రవితేజ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేస్తాడో చూడాలి. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, పూజితా పోన్నాడా కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీలో అక్కినేని సుశాంత్ కూడా నటిస్తున్నాడు. మరి టీజర్ తో మంచి బజ్ జనరేట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ ట్రైలర్ తో ఎలాంటి అంచనాలని సృష్టిస్తారో చూడాలి.
The fireworks will begin in advance for you all 🤗#RavanasuraTrailer on 28th March at 4:05 PM 😎#Ravanasura#RavanasuraOnApril7 pic.twitter.com/lE0DFISvUD
— Ravi Teja (@RaviTeja_offl) March 25, 2023