Site icon NTV Telugu

Mass Jathara : మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ – రవితేజ మాస్ ఎంట్రీకి రెడీ!

Mass Jathara Trailor Update

Mass Jathara Trailor Update

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ జాతర నుంచి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 27న (సోమవారం) విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రవితేజ అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్లు వేగంగా జోరందుకున్నాయి.

Also Read : Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం పై సెలబ్రిటీల స్పందన..

ఇక ‘మాస్ జాతర’ లో రవితేజ ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. భానుభోగవరపు రైటింగ్ స్టైల్‌కి అనుగుణంగా మాస్, ఎమోషన్, కామెడీ అన్నీ కలగలిపిన పకడ్బందీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పంచ్ డైలాగులు, రవితేజ ఎనర్జీ – ఇవన్నీ కలగలిపి సినిమాను మాస్ ఫెస్టివల్‌గా మార్చేలా ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. ఇక ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం. రవితేజ కెరీర్‌లో మరో పకా మాస్ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందేమో చూడాలి.

 

Exit mobile version