మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవలే బోళా శంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరు.. మరో పక్క బాబీ దర్శకత్వంలో వస్తున్నా చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేసాడు. ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం మాస్ మహారాజ రవితేజను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
చిరు తమ్ముడి పాత్రలో రవితేజ మెరవనున్నారట.. ఇకపోతే 2000 సంవత్సరంలో విడుదలైన ‘అన్నయ్య’ చిత్రంలో రవితేజ చిరంజీవికి తమ్ముడిగా కనిపించారు. ఇక ఈ వార్త నిజమైతే మరోసారి చిరు తమ్ముడిగా రవితేజ అలరించనున్నాడు.ఇప్పటికే రవితేజ ఈ పాత్రకు ఓకే కూడా చెప్పినట్లు సమాచారం. మరి ఆ పాత్ర సినిమా మొత్తం ఉంటుందా..? లేదా స్పెషల్ అప్పీయరెన్స్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. 21 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ కాంబో రిపీట్ కానుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
