Site icon NTV Telugu

Maskathadi: బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఐటెం సాంగ్ రిలీజ్

Masakathadi Song Releaased

Masakathadi Song Releaased

Maskathadi Lyrical Song from Prema Desapu Yuvarani: యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘ప్రేమదేశపు యువరాణి’ చిత్రం విడుదలకి సిద్ధం అవుతోంది. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి సునీల్‌ నిమ్మల దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమాలోని ‘మసకతడి’ అనే ఐటెం సాంగ్ ను మణికొండలోని తాగేసిపో అని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో విడుదల చేశారు.

Dareen Kent Died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. చిన్నవయసులోనే నటుడి మృతి

ఇక ఈ ఐటెం సాంగ్ రిలీజ్ సందర్భంగా హీరో యామిన్‌ మాట్లాడుతూ ‘ఓపెన్‌ బార్‌లో ప్రేక్షకుల సమక్షంలో పాటను విడుదల చేయడం, వారి నుంచి చక్కని స్పందన రావడం చక్కని అనుభూతి కలిగించిందని, సెలబ్రిటీల సమక్షంలో ఇలాంటి వేడుక చేయడం రొటీన్‌ మేమిలా వినూత్నంగా ప్లాన్‌ చేశాం, దర్శకుడి ఐడియాకు ధన్యవాదాలు’ అని అన్నారు. దర్శకుడు సునీల్ మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా సాగే లవ్‌స్టోరీ ఇది, బార్‌లో పాట విడుదల చేయడం తప్పని అనుకున్నా ఇలా కొత్తగా పబ్లిసిటీ చేస్తేనే చిన్న సినిమాలు జనాల్లోకి వెళతాయని అన్నారు. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని సునీల్ అన్నారు. శివకుమార్‌ దేవరకొండ కెమెరామెన్ గా పని చేసిన ఈ సినిమాకి అజయ్‌ పట్నాయక్‌ సంగీతం అందించగా కాసర్ల శ్యామ్‌, సాయి సునీల్‌ నిమ్మల, భాను–కృష్ణ పాటలు రాశారు.

Exit mobile version