NTV Telugu Site icon

Marvel Cinematic Universe: సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 నుంచి ఫస్ట్ సీరీస్…

Marvel Cinematic Universe

Marvel Cinematic Universe

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 ఫిబ్రవరి నెలలో యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా సినిమాతో స్టార్ట్ అయ్యింది. రీసెంట్ MCU ఫేజ్-5 నుంచి గార్డియన్స్ ఆఫ్ ది గేలక్సీ వాల్యూమ్ 3 కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఫేజ్-5కి హైప్ తీసుకోని రావడంలో ఫెయిల్ అయ్యాయి. టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి ఆ రేంజ్ హై ఇచ్చే సినిమా ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను అంటూ వస్తున్నాడు ‘నిక్ ఫ్యూరి’.  MCU లవర్స్ కి, అవెంజర్స్ సినిమాలని ఫాలో అయిన ప్రతి ఒక్కరికీ ‘నిక్ ఫ్యూరి’ క్యారెక్టర్ బాగా పరిచయమే. సామ్యుల్ జాక్సన్ ప్లే చేసిన ఈ క్యారెక్టర్ ని బేస్ చేసుకోని ‘సీక్రెట్ ఇన్వాషణ్’ అనే వెబ్ సీరీస్ రూపొందింది. ఫేజ్-5 నుంచి రిలీజ్ అవుతున్న ఫస్ట్ వెబ్ సీరీస్ ఇదే కావడం విశేషం. ఫార్మర్ SHIELD డైరెక్టర్ అయిన నిక్ ఫ్యూరి, అవెంజర్స్ ఎండ్ గేమ్ లో తన మిత్రులు చనిపోయిన తర్వాత తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ “షేప్‌షిఫ్టింగ్ స్క్రల్ డబుల్-ఏజెంట్‌లను ప్రపంచంలోని కొన్ని అత్యంత శక్తివంతమైన అధికారం ఉండే స్థానాలు ఇవ్వడం వెనక కుట్ర ఉంది అని భావించి, ఆ కుట్రను నిక్ ఫ్యూరి ఎలా బయటపెట్టాడు అనేది ‘సీక్రెట్ ఇన్వాషణ్’ వెబ్ సిరీస్ కథ.

‘కెప్టెన్ మార్వెల్’ సినిమాలో మొదటిసారి ఈ షేప్ షిఫ్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. జూన్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ కానున్న ‘సీక్రెట్ ఇన్వాషణ్’ ట్రైలర్ ని MCU రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో ఫేజ్-5 వచ్చిన సినిమాలు మిస్ అయిన ఇంపాక్ట్ ఉంది. సీరియస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్నింటికీ మించి సీక్రెట్ ఇన్వాషణ్ కథకి పాత అవెంజర్స్ కథకి లింక్ ఉంది. అందుకే ఫేజ్-5కి సీక్రెట్ ఇన్వాషణ్ మంచి బూస్ట్ తెస్తుందని MCU లవర్స్ ఫీల్ అవుతున్నారు. మరి థామస్, అలీ కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ ఆరు ఎపిసోడ్స్ ఉన్న సీక్రెట్ ఇన్వాషణ్ ఎంత వరకూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.