Marvel Cinematic Universe: సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 నుంచి ఫస్ట్ సీరీస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 ఫిబ్రవరి నెలలో యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా సినిమాతో స్టార్ట్ అయ్యింది. రీసెంట్ MCU ఫేజ్-5 నుంచి గార్డియన్స్ ఆఫ్ ది గేలక్సీ వాల్యూమ్ 3 కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఫేజ్-5కి హైప్ తీసుకోని రావడంలో ఫెయిల్ అయ్యాయి. టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి ఆ రేంజ్ హై ఇచ్చే సినిమా ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను అంటూ వస్తున్నాడు ‘నిక్ ఫ్యూరి’. MCU లవర్స్ కి, అవెంజర్స్ సినిమాలని ఫాలో అయిన ప్రతి ఒక్కరికీ ‘నిక్ ఫ్యూరి’ క్యారెక్టర్ బాగా పరిచయమే. సామ్యుల్ జాక్సన్ ప్లే చేసిన ఈ క్యారెక్టర్ ని బేస్ చేసుకోని ‘సీక్రెట్ ఇన్వాషణ్’ అనే వెబ్ సీరీస్ రూపొందింది. ఫేజ్-5 నుంచి రిలీజ్ అవుతున్న ఫస్ట్ వెబ్ సీరీస్ ఇదే కావడం విశేషం. ఫార్మర్ SHIELD డైరెక్టర్ అయిన నిక్ ఫ్యూరి, అవెంజర్స్ ఎండ్ గేమ్ లో తన మిత్రులు చనిపోయిన తర్వాత తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ “షేప్‌షిఫ్టింగ్ స్క్రల్ డబుల్-ఏజెంట్‌లను ప్రపంచంలోని కొన్ని అత్యంత శక్తివంతమైన అధికారం ఉండే స్థానాలు ఇవ్వడం వెనక కుట్ర ఉంది అని భావించి, ఆ కుట్రను నిక్ ఫ్యూరి ఎలా బయటపెట్టాడు అనేది ‘సీక్రెట్ ఇన్వాషణ్’ వెబ్ సిరీస్ కథ.
‘కెప్టెన్ మార్వెల్’ సినిమాలో మొదటిసారి ఈ షేప్ షిఫ్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. జూన్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ కానున్న ‘సీక్రెట్ ఇన్వాషణ్’ ట్రైలర్ ని MCU రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో ఫేజ్-5 వచ్చిన సినిమాలు మిస్ అయిన ఇంపాక్ట్ ఉంది. సీరియస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్నింటికీ మించి సీక్రెట్ ఇన్వాషణ్ కథకి పాత అవెంజర్స్ కథకి లింక్ ఉంది. అందుకే ఫేజ్-5కి సీక్రెట్ ఇన్వాషణ్ మంచి బూస్ట్ తెస్తుందని MCU లవర్స్ ఫీల్ అవుతున్నారు. మరి థామస్, అలీ కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ ఆరు ఎపిసోడ్స్ ఉన్న సీక్రెట్ ఇన్వాషణ్ ఎంత వరకూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
Who do you trust?
Marvel Studios’ #SecretInvasion, an Original series, is streaming June 21 on @DisneyPlus. pic.twitter.com/lWnJ8ydH8r
— © Avengers (@Avengers) April 3, 2023
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!