NTV Telugu Site icon

Marvel Cinematic Universe: అనుకున్నదే అయ్యింది, ఆ సినిమా ఇక్కడ ఆడట్లేదు

Ant Man

Ant Man

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో MCU మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అవెంజర్స-ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్- ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ నో వే హోమ్, థార్ లాంటి సినిమాలు ఇండియాలో కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. అవతార్ 2 లాంటి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంటే, మార్వెల్ ఫేజ్ 5 నుంచి వచ్చిన ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ సినిమా మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వీక్ గానే ఉంది.

Read Also: MCU: మార్చ్ 5న మార్వెల్ ఫేజ్ 5 నుంచి మూవీ రిలీజ్…

పాల్ రూడ్- ఇవాంజెలిన్ లిల్లీ – బిల్ ముర్రే నటించిన ‘యాంట్ మేన్’ సీరీస్ లోని 3వ సినిమాకి పేటన్ రీడ్ దర్శకత్వం వహించాడు. రిలీజ్ రోజు నుంచే యావరేజ్ తక స్ప్రెడ్ అవ్వడంతో ఇండియాలో ఈ మూవీ ఆశించిన బుకింగ్స్ ని రాబట్టలేకపోయింది. ఇండియాలోనే కాదు US మార్కెట్ లో తప్ప ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ ఇంపాక్ట్ ఇంకెక్కడా కనిపించట్లేదు. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1862 కోట్లు(225 మిలియన్ డాలర్స్) వసూలు చేసింది.  ఏరియా వైజ్ చూస్తే ఫస్ట్ వీకెండ్ లో ఓవర్సీస్ నుంచి ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’  సినిమా 121.3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తే కేవలం అమెరికాలోనే 104 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ఓవరాల్ గా ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ రాబట్టిన కలెక్షన్స్ లో 45% US మర్కెట్స్ నుంచి వచ్చినవే. దీన్ని బట్టి చూస్తే ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ సినిమాని మన ఆడియన్స్ మాత్రమే కాదు అన్ని ఏరియాల్లోని ఆడియన్స్ రిజెక్ట్ చేసినట్లు ఉన్నారు.

Show comments