NTV Telugu Site icon

Maruthi: మారుతీని ఏకిపారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. నీకు సినిమా ఇచ్చింది ఎవరు.. ?

Maruthi

Maruthi

Maruthi: సాధారణంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైరెక్టర్స్ ఎవరైనా సరే .. హీరో ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. హీరో ఏ ఈవెంట్ కు వెళ్లినా.. వేరే సిటీ వెళ్లినా పక్కనే ఉంటాడు. అందుకు కారణం.. సినిమా సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. కథలో మార్పులు చేర్పులు అని, డిజైనర్ లుక్ అని ఇలా ఉండడం వలన హీరో ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్టర్ వాలిపోతూ ఉంటాడు. అంతేకాకుండా స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే .. తదుపరి సినిమా డైరెక్టర్ సైతం ఆ సినిమా అప్డేట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. టీజర్, ఫస్ట్ గ్లింప్స్ లాంటివి వస్తే షేర్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ, డైరెక్టర్ మారుతీ మాత్రం ఆ పని చేయలేదని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రభాస్- మారుతీ కాంబోలో ప్రస్తుతం రాజా డీలక్స్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒక చిన్న సినిమాగా అనుకున్నా కూడా ప్రభాస్ రేంజ్ ను బట్టి అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

OG Movie: పవన్ సినిమాలో అమితాబ్ బచ్చన్.. గుండె ఆగిపోయేలా పోస్టర్.. ?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ తీసుకున్న డార్లింగ్.. త్వరలోనే కొత్త షెడ్యూల్ లో అడుగుపెట్టనున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ మధ్యనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. శాన్ డియాగో కామిక్ కాన్ లాంటి ఇంటర్నేషనల్ వేదికపై కల్కి ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోపై అభిమానులే కాకుండా టాలీవుడ్ మొత్తం స్పందించింది. ముఖ్యంగా ప్రభాస్ తో పనిచేసిన డైరెక్టర్స్ కూడా వీడియోను షేర్ చేస్తూ సూపర్ అంటూ ప్రశంసించారు. కానీ, ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి పనిచేస్తున్న మారుతీ మాత్రం ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. సరే బిజీలో ఉన్నాడు.. ట్విట్టర్ వాడడం లేదు అనుకోవడానికి కూడా లేదు.. బేబీ సినిమా సక్సెస్ ను మారుతీ సెలబ్రేట్ చేస్తున్నాడు. బేబీ కు సంబంధించిన ట్వీట్స్ అయితే వేస్తున్నావ్ కానీ, ప్రభాస్ కు సంబంధించిన ఒక్క ట్వీట్ వేయడం లేదు.. నీకు సినిమా ఇచ్చింది ఎవరు.. ? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మారుతీ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Show comments