NTV Telugu Site icon

Market Mahalakshmi: కూరలమ్మే పిల్లతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమాయణం.. టీజర్ చూశారా?

Market Mahalakshmi Teaser

Market Mahalakshmi Teaser

Market Mahalakshmi Teaser: కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా కొత్త అమ్మాయి ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అఖిలేష్ కలారు ఈ సినిమాను నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ సినిమాలో హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీ ‘టీజర్’ ని టాలీవుడ్ హీరో “శ్రీ విష్ణు” ఘనంగా లాంచ్ చేశారు. అనంతరం హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ టీజర్ చూసాను చాలా ఫన్నీగా ఉంది. హీరో & హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుంది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి, అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది, ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నానని అన్నారు.

Varun Tej: మా సినిమాతో బీజేపీ, అర్ఎస్ఎస్ కి సంబంధం లేదు

డైరెక్టర్ వియస్ ముఖేష్ చేసిన కొత్త ప్రయత్నాన్ని ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఇక టీజర్ పరిశీలిస్తే హీరో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. సరిగ్గా యాడ్స్ సమయంలో అతని తల్లి కూరగాయలు కొనడానికి మార్కెట్ కి వెళ్లి అక్కడ మార్కెట్లో కూరగాయలు అమ్మే అమ్మాయితో గొడవ పడుతుంది. గొడవ పెద్దది అవ్వడంతో తన కొడుకుని అక్కడికి రమ్మంటుంది. తనకు గొడవలో సహాయం చేస్తాడని అనుకుంటే అతను వెళ్లి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడంతో ఆమె లాగి ఒకటి పీకుతుంది, అది చూసి అతని తల్లి కూడా ఒకటి పీకుతుంది. మొత్తం మీద టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.
YouTube video player