Site icon NTV Telugu

Maari Selvaraj: అంత ప్రేముంటే వాళ్ళ కులపోళ్లకే అవకాశాలివ్వచ్చుగా!

Samyuk

Samyuk

మారి సెల్వరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వెళ్తున్న ఆయన, తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు కొంతమందికి ఆగ్రహం తెప్పించాయి. అసలు విషయానికి వస్తే, తమిళంలో ఎక్కువగా అణగారిన వర్గాల సినిమాలను చేస్తూ వచ్చేవారు మారి సెల్వరాజ్. అయితే, ఆయన సినిమాలలో తమిళ నటీమణులను ఎందుకు తీసుకోవడం లేదు? అనే విషయం మీద ప్రశ్నిస్తే, ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే, “ఇప్పుడు సినిమాలో ఏదైనా అంగ వికలాంగులకు సంబంధించిన క్యారెక్టర్ ఉంటే, అంగవికలాంగుల చేత చేయించాలా ఏంటి?” అంటూ ప్రశ్నించారు.

Also Read :Rashmika : మగాళ్ళకి పీరియడ్స్.. అవసరమా రష్మిక?

అయితే, సంయుక్తా షాన్ అనే ఒక నటీమణి మాత్రం మారి సెల్వరాజ్ లాంటి దర్శకుడి నుంచి ఇలాంటి కామెంట్స్ ఊహించలేదని కామెంట్ చేసింది. “ఆయన రెస్పాన్స్ మాత్రం నన్ను షాక్కి గురిచేసింది” అని ఆమె అన్నారు. ఆయన కనక ఒక సాధారణమైన అమ్మాయిని తీసుకువచ్చి, ఒక మంచి యాక్టర్గా తీర్చిదిద్దగలను అనుకుంటే కనుక, ఆయన ఎప్పుడూ తన జాతి గురించి, కులం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన ఎందుకు తన జాతి లేదా కులానికి సంబంధించిన వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదు? వారిలో కూడా మంచి నటీనటులు ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు లైమ్ లైట్లోకి తీసుకురావడం లేదని ఆమె ప్రశ్నించింది. ఆమె ప్రశ్నించిన వాటిలో నిజమే ఉంది. మరి, మారి సెల్వరాజ్ దీనికి ఏమైనా సమాధానం చెబుతారో చూడాలి.

Exit mobile version