NTV Telugu Site icon

బీచ్ ఒడ్డున బికినీలో మిస్ ఇండియా .. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోందిగా!!

ప్రస్తుతం సెలబ్రిటీలందరికి చల్లగా సేద తీరడానికి ఉన్న ఒకే ఒక్క ప్రదేశం.. మాల్దీవ్స్ ..కొంచెం సమయం దొరికినా స్టార్లందరూ బ్యాగ్ సర్దేసుకొని మాల్దీవులకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లందరూ మాల్దీవుల ఒడ్డున బికినీలో పోజులు ఇచ్చి కుర్రకారులో సెగలు పొగలు తెప్పించారు. ఇక తాజాగా మాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ వంతు వచ్చింది. ఇటీవలే కిరీటాన్ని అందుకున్న మానుషీ టైమ్ దొరకడంతో ఎంచక్కా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

మోడలింగ్ నుంచి వచ్చిన భామ కాబట్టి అందచందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని ఈ ఫోటోలు చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక తాజగా అమ్మడు సముద్ర తీరాన రెడ్ బికినీలో హాట్ లుక్స్ తో పిచ్చెక్కించింది. మండే ఎండలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటూ టెంప్టింగ్ పోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఆగుతారా..? ఈ ఫోటోలను వైరల్ గా మార్చేశారు. ఇక అమ్మడు త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. మరి మిస్ ఇండియా బాలీవుడ్ మొదటి సినిమాతో హిట్ ని అందుకుంటుందో లేదో చూడాలి.