NTV Telugu Site icon

Osho Tulasiram: ‘దక్షిణ’ చెల్లిస్తానంటున్న సాయి ధన్సిక!

Dakshina

Dakshina

Sai Dhansika: ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. దీని చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ”ఇదొక సైకో థ్రిల్లర్. సినిమా అంతా భావోద్వేగాలదే ప్రధాన పాత్ర. సాయి ధన్సిక ఐపీఎస్ అధికారి పాత్ర చేశారు. పవర్‌పుల్ రోల్‌లో ఆమె అద్భుతంగా నటించారు. ‘దక్షిణ’ విడుదల తర్వాత ఆమెకు మరింత పేరు వస్తుంది. హైదరాబాద్, విశాఖపట్టణం, గోవాల్లో చిత్రీకరణ చేశాం. మొత్తం 45 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాం. ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాల తరహాలో ‘దక్షిణ’ కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది” అని చెప్పారు.
 
ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి పోషిస్తున్నారు. దీనికి ఛాయాగ్రహణం నర్సింగ్, సంగీతం బాలాజీ అందిస్తున్నారు.