Mirai : మంచు మనోజ్ ఏడేళ్ల తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో నెగెటివ్ రోల్ చేశాడు. కానీ పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదు. అయితే ఇప్పుడు మిరాయ్ లో మాత్రం పూర్తిగా విలన్ పాత్రలో జీవించేశాడు. మొదటి షో నుంచే మిరాయ్ టాక్ అదిరిపోయింది. దెబ్బకు సూపర్ హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇందులో మనోజ్ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. హీరో పాత్రకు ఏ మాత్రం సరిపోని విధంగా పవర్ ఫుల్ గా ఉంది ఆయన పాత్ర. ఇందులో తన విలనిజాన్ని చూపించేశాడు. ఇక్కడే ఆయన తండ్రి మోహన్ బాబు గురించి చర్చ జరుగుతోంది. మనకు తెలిసిందే కదా.. మోహన్ బాబు ఇండస్ట్రీలో విలన్ పాత్రలతోనే బాగా ఫేమస్ అయ్యాడు.
Read Also : Karishma Sharma : రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన స్టార్ హీరోయిన్.. తీవ్ర గాయాలు
ఆ తర్వాత హీరోగా మరింత రాటుదేలి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. ఇప్పుడు మనోజ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. ఆయన మొదట్లో హీరోగా చేశాడు. కానీ స్టార్ డమ్ అందుకోలేదు. చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. ఇప్పుడు విలన్ గా మాత్రం స్టార్ డమ్ అందుకునేలా కనిపిస్తున్నాడు. హీరోగా కంటే విలన్ గానే ఎక్కువగా పేరొస్తోంది మనోజ్ కు. అంటే తండ్రి ఎలాగైతే విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడో.. ఇప్పుడు మనోజ్ కూడా అలాగే పేరు సంపాదించుకునేలా కనిపిస్తున్నాడన్నమాట. మిరాయ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా మనోజ్ కు గుర్తింపు రావడం ఖాయం అనిపిస్తోంది. అదే జరిగితే మరిన్ని పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో విలన్ గా కనిపించే ఛాన్సులు ఉన్నాయి.
Read Also : Tamannah : అతన్నే పెళ్లి చేసుకుంటా.. తమన్నా షాకింగ్ ఆన్సర్
