Manoj Manchu Is Back With A Game Show For ETV Win Named Ustaad- Ramp-Adidham: మంచు మనోజ్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే పనిలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొన్ని కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మనోజ్ ప్రస్తుతం ఒక పక్క సినిమా చేస్తూనే మరోపక్క హోస్ట్ గా కూడా మారాడు. ఈటీవీ విన్ కోసం మనోజ్ ఒక షో చేస్తున్నాడని అప్పట్లో ఒక ప్రోమో రిలీజ్ చేయగా అది అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ షోకి రాంప్ ఆడిద్దాం అనే టైటిల్ అనుకుంటున్నారు అని కూడా ప్రచారం అయింది. అయితే తాజాగా ఈ షో టైటిల్ ను మనోజ్ రివీల్ చేశాడు, నా తొలి గేమ్ షో #USTAAD ర్యాంప్-ఆడిద్దాం టైటిల్‌ను వెల్లడించడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఫన్, ఎంటర్ టైన్మెంట్ తో స్మాల్ స్క్రీన్ వైల్డ్‌గా మారబోతోంది.
Sudigali Sudheer: ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను.. సుడిగాలి సుధీర్ ఎమోషనల్
సంవత్సరాలుగా మీ ప్రేమకు నేను కృతజ్ఞుడను. మంచి వైబ్‌లు వస్తున్నాయి, ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన రైడ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ మనోజ్ రాసుకొచాడు. మొదటి ఎపిసోడ్ షూట్ లో హనుమాన్ టీమ్ పాల్గొన్నారు. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మంచు వారి షోకి తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ వచ్చారు. వారితో మనోజ్ ఒక రేంజ్ లో ఆడుకున్నట్లు చెబుతున్నారు. ఇక ETV విన్, తెలుగు OTT యాప్, మార్చి 2023లో ప్రారంభించినప్పటి నుండి అనేక విజయాలను సాధించింది. యాప్ 5 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటేసిన క్రమంలో ETV విన్ ప్రతి సంవత్సరం 24 ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్‌లను, ప్రతి వారం కొత్త కంటెంట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇలా ఒరిజినల్ గేమ్ షోస్ ను కూడా డిజైన్ చేస్తోంది.
I am delighted to reveal the title of my debut game show, #USTAAD Ramp-Adidham! 🔥 The small screen is about to become wild with entertainment and fun.
I am grateful for your love over the years. Exciting vibes are coming up! 🙌😊
Get ready for a wholesome fun ride! ✨🤗… pic.twitter.com/L2z4FacB5a
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 29, 2023