Site icon NTV Telugu

Mirai : అతను నా కుటుంబాన్ని నిలబెట్టాడు.. మనోజ్ ఎమోషనల్

Mirai Manoj

Mirai Manoj

Mirai : మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు. మిరాయ్ సినిమాలో విలన్ గా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మనోజ్ కు విలన్ గా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. తేజసజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా నిర్వహించిన మూవీ సక్సెస్ మీట్ లో మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడేళ్ల క్రితం ఓకే చెప్పాను. నన్ను చాలా మంది ఫ్యాన్స్ అడుగుతుంటారు. అన్న ఎప్పుడు కమ్ బ్యాక్ ఇస్తున్నావ్ అని. త్వరలోనే అని చెబుతూ వచ్చాను. చాలా సినిమాలు చేతుల దాకా వచ్చి చేజారిపోయాయి. అలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు.

Read Also : Samantha : అవన్నీ శాశ్వతం కాదు.. రిలేషన్ పై సమంత షాకింగ్ కామెంట్

ఈ సినిమా నాతో చేస్తున్నప్పుడు చాలా మంది వద్దని నిర్మాత విశ్వ ప్రసాద్ కు చెప్పి ఉంటారు. కానీ ఆయన నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా నాకు కేవలం ఒక పాత్రను మాత్రమే ఇవ్వలేదు. ఈ సినిమాతో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని నా కుటుంబాన్ని నిలబెట్టాడు. అతనికి జన్మంతా రుణపడి ఉంటాను. ఆయన వల్లే ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నాను. తేజ నాకు తమ్ముడు. అతని కోసం ఎప్పుడూ నా వంతు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఈ సినిమా అతను అడిగాడు కాబట్టే చేస్తానని చెప్పాను. ఎప్పటికీ మంచి కథలు చేయాలని అనుకుంటాను. కానీ అన్ని సార్లు కుదరకపోవచ్చు. ఈ సినిమాతో అది కుదిరింది అంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్.

Read Also : Manchu Lakshmi అవన్నీ ఫేక్.. బెట్టింగ్ యాప్ కేసుపై మంచు లక్ష్మీ రియాక్ట్..

Exit mobile version