Site icon NTV Telugu

Family Man 3: హోలీకి ‘ఫ్యామిలీ’తో శ్రీకాంత్ వస్తున్నాడు…

Family Man 3

Family Man 3

మనోజ్ బాజ్పాయ్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మాన్’. అమెజాన్ నుంచి వచ్చిన ఈ సీరీస్ ఇండియాలో తెరకెక్కిన ది బెస్ట్ వెబ్ సీరీస్ లో ఒకటిగా నిలిచింది. ఒటీటీలో వంద కోట్ల మార్కెట్ ఉందని నిరూపించిన ఫ్యామిలీ మాన్ సీరీస్ లో మనోజ్ బాజ్పాయ్ మెయిన్ రోల్ ప్లే చేశాడు. శ్రీకాంత్ అనే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా మనోజ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది. రాజ్ అండ్ డీకే ఈ సీరీస్ ని అద్భుతంగా రూపొందించారు. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో, సెకండ్ సీజన్ ని మరింత గ్రాండ్ గా చేసి దానితో కూడా సాలిడ్ హిట్ కొట్టారు మేకర్స్. సెకండ్ సీజన్ లో విలన్ గా సమంతా నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యింది. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ అయిన వెబ్ సీరీసుల్లో ఫ్యామిలీ మ్యాన్ 2 టాప్ ప్లేస్ లో ఉంటుంది.

Read Also: Mirchi: పదేళ్ళ కిత్రం ఘాటెక్కించిన ‘మిర్చి’!

సెకండ్ సీజన్ లో ఓపెన్ ఎండ్ ఇవ్వడంతో సీజన్ 3 కోసం ఫాన్స్ వెయిట్ చెయ్యడం మొదలు పెట్టారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3ని హోలీకి ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మనోజ్ బాజ్పాయి తన ట్విట్టర్ అకౌంట్ ఒక వీడియోని పోస్ట్ చేస్తూ “ఈ హోలీకి మీ ఫ్యామిలీ ముందు నా ఫ్యామిలీని తీసుకోని వస్తున్నాను, రెడీగా ఉండండి” అని చెప్పాడు. దీంతో మార్చ్ 8న ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రిలీజ్ అవుతుందనే విషయం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. మరి మొదటి రెండు సీజన్స్ లాగే సీజన్ 3 కూడా సెన్సేషనల్ హిట్ అవుతుందా? ఈసారి శ్రీకాంత్ ఎలాంటి మిషన్ ని టేకప్ చేయబోతున్నాడు? అనే విషయాలకి సమాధానం తెలియాలి అంటే మార్చ్ 8 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Exit mobile version