Site icon NTV Telugu

వివాదంలో నవరస… నెట్ ఫ్లిక్స్ బ్యాన్ చేయాల్సిందేనా?

NAvarasa

మణిరత్నం ప్రతిష్ఠాత్మక వెబ్ to tv సిరీస్ ‘నవరస’ వివాదంలో ఇరుక్కుంది. ప్రధానంగా సిద్ధార్థ్, పార్వతీ నటించిన ‘ఇన్మై’ సెగ్మెంట్ కొందరు ముస్లిమ్ ల ఆగ్రహానికి కారణం అవుతోంది. నెట్ ఫ్లిక్స్ ‘నవరస’ ప్రచారంలో భాగంగా ‘ఇన్మై’ సెగ్మెంట్ కు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో సిద్ధార్థ్, పార్వతీ ముఖాల వెనుక, బ్యాక్ గ్రౌండ్ లో… ఖురాన్ కు చెందిన పదాలు, పంక్తులు ఉన్నాయి. అవే దుమారానికి మూలంగా మారాయి…

Read Also : “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్

ఖురాన్ లోని ఏ భాగాన్ని కానీ పోస్టర్ల మీద, ఇతర చోట్ల అచ్చువేయటానికి ముస్లిమ్ లు ఒప్పుకోరు. అది వారికి పవిత్రం కావటంతో ప్రార్థన కోసం తప్ప ఇంక దేనికి వారు వాడరు. అయితే, నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఖురాన్ లోని కొంత భాగం అచ్చై ఉండటం కొందరికి ఆగ్రహం కలిగించింది. అలా పబ్లిసిటీకి వాడుకున్నందుకే వారంతా ఇప్పుడు ‘బ్యాన్ నెట్ ఫ్లిక్స్’ అంటున్నారు. హ్యాష్ ట్యాగ్ నడుపుతున్నారు. ట్విట్టర్ లో ఇప్పుడు ఇది ట్రెండింగ్ గా మారింది.

‘నవరస’లో ‘ఇన్మై’ సెగ్మెంట్ భయం అనే రసానికి సంబంధించినది. ఇంకా ఇంత వరకూ నెట్ ఫ్లిక్స్ ఖురాన్ గొడవపై స్సందించలేదు. చూడాలి మరి, ముస్లిమ్ వర్గాల నుంచీ వస్తున్న ఒత్తిడికి ‘భయపడి’… తమ ‘భయం’ సెగ్మెంట్ పోస్టర్ ని నెట్ ఫ్లిక్స్ మార్చేస్తుందో లేదో! అలాగే, బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పాలంటున్నారు వివిధ ముస్లిమ్ సంస్థలకు చెందిన వారు…

Exit mobile version