Site icon NTV Telugu

Mani Sai teja: ‘మెకానిక్’ పని మొదలెట్టేశాడు!

Sai

Sai

 

టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్. నాగ మునెయ్య), కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ ను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నామని, సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఇందులో వినోదానికి పెద్ద పీట వేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. మణి సాయితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ ‘మెకానిక్’ చిత్రంలో రేఖ నిరోషా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా శుక్రవారం ప్రారంభమై, రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ‘ఛత్రపతి’ శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ మూవీకి చంద్రబోస్, ఎమ్.ఎన్. సింహా సాహిత్యం అందిస్తున్నారు. వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చుతున్నారు. ఎస్.వి. శివరాం ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్.

Exit mobile version