Site icon NTV Telugu

Mangli : కాపీ కొట్టి అడ్డంగా దొరికిన సింగర్ మంగ్లీ.. అసలు నిజమిదే!

Baayi

Baayi

సింగర్ మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ ఈమధ్య బాగా వైరల్ అయింది. అయితే, ఈ సాంగ్ మీద విమర్శలు సైతం వచ్చాయి. తెలంగాణ యాసలో ఉంది కానీ, తెలంగాణ వారికి తెలియని పదాలు ఎన్నో పాట రచనలో వాడారంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. అదేమిటంటే.. ఈ సాంగ్ లానే ఉన్న మరో బంజారా సాంగ్ ఒకటి ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. దీంతో ఈ పాటను మంగ్లీ అక్కడి నుంచి కాపీ కొట్టిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు.

Also Read :Naa Anveshana : నా అన్వేషణకు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి మహిళా కమిషన్..!

అంతేకాక, పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి, ఆ సాంగ్ మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ నుంచి ఇన్‌స్పయిర్ అయ్యి రాసుకున్న పాట. ఈ విషయాన్ని ఆ సాంగ్ అప్‌లోడ్ చేసిన సమయంలోనే యూట్యూబ్‌లో మెన్షన్ చేశారు. అయితే, ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయకుండా, కనీసం రెండు సాంగ్స్ ఎప్పుడు విడుదల అయ్యాయో కూడా చెక్ చేసుకోకుండానే మంగ్లీ మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొంతమంది ఈ విషయాన్ని గమనించి, మంగ్లీ అభిమానులు సోషల్ మీడియాలో తేటతెల్లం చేస్తూ.. తమ అభిమాన సింగర్‌ని టార్గెట్ చేయవద్దంటూ పోస్టులు పెడుతున్నారు.

Exit mobile version