Mangalavaram: మంగళవారం ఓటిటీ.. నెట్ ఫ్లిక్స్ కాదంటరోయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో అదే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం మంగళవారం. ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా రిలీజ్ అయ్యి భారీ కలక్షన్స్ రాబట్టింది. ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ లో మిస్ అయ్యిన వారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీ లో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి ఈ చిత్రం ఓటిటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని కొందరు.. ఆహా కొన్నది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
ఇకపోతే ఆ రెండు కాకుండా మంగళవారం డిజిటల్ హక్కులను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మంగళవారం సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఈ నెలలోనే మంగళవారం సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరి థియేటర్ లో హల్చల్ చేసిన ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?