NTV Telugu Site icon

Mangalavaaram Teaser: ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా! ఆసక్తిగా మంగళవారం టీజర్

Mangalavaaram Teaser

Mangalavaaram Teaser

Actress Payal Rajput New Movie Mangalavaaram Teaser Out: హాట్ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తాజా నటిస్తున్న సినిమా ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్ 100’ వంటి భారీ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్‌ మరోసారి నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న మంగళవారం సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇందులో భాగంగా నేడు టీజర్‌ను విడుదల చేసింది.

ఒక నిమిషం 18 సెకండ్ల నిడివి గల మంగళవారం సినిమా టీజర్‌.. ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. గ్రామస్తులందరూ ఏదో చూసి భయపడుతున్న సీన్స్ చూపించారు. ఇక టీజర్‌ ‘ఏం చూశారండి’ అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. టీజర్‌ చివర్లో పాయల్‌ రాజ్‌పుత్‌ బోల్డ్ లుక్‌లో అరుస్తూ కనిపించారు. ఇక ‘ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా’ అనే డైలాగ్ అందరికి నవ్వు తెప్పిస్తుంది. మొత్తానికి టీజర్‌ చాలా ఆసక్తిగా ఉంది.

Also Read: iPhone 15 Launch 2023: సెప్టెంబర్ 5న ఐఫోన్ 15 లాంచ్.. అదనంగా 5 ఫీచర్లు! యాపిల్ లవర్స్‌కు పండగే

ఆర్‌ఎక్స్ 100 సినిమాలో చేసిన విధంగా మరోసారి పాయల్‌ రాజ్‌పుత్‌ బోల్డ్ రోల్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పాయల్‌ టాప్‌లెస్‌గా కనిపించారు. టీజర్‌లో బోల్డ్ సహా భయపెట్టారు కూడా. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కమర్షియల్ హంగులతో మంగళవారం సినిమాను అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి అద్భుతమైన సినిమా తీస్తున్నట్లు నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి తెలిపారు. సినిమా పూర్తి చేయడానికి మొత్తం 99 రోజులు పట్టిందని.. 48 రోజులు పగటి పూట, 51 రోజులు రాత్రి వేళల్లో షూటింగ్ చేశామని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో ఈ సినిమా తీస్తున్న దర్శకుడు అజయ్ భూపతి పేర్కొన్నారు. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయని, ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుందన్నారు. కాంతార సినిమా ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రంకు సంగీతం అందిస్తున్నారు.

Also Read: Realme Narzo 60 Series Launch: రియల్‌మీ నార్జో 60 సిరీస్ లాంచ్.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!

 

Show comments