NTV Telugu Site icon

Mangalavaaram : మంగళవారం మేకింగ్ వీడియో అదిరిపోయింది గా..

Whatsapp Image 2023 11 16 At 6.27.50 Pm

Whatsapp Image 2023 11 16 At 6.27.50 Pm

ఆర్ఎక్స్ 100 సినిమాతో అద్భుత విజయం అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తీసిన సినిమా మంగళవారం శుక్రవారం (నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా టైటిల్ తో నే సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసారు మేకర్స్..అయితే తాజాగా గురువారం (నవంబర్ 16) మేకర్స్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో మాత్రం అదిరిపోయింది మంగళవారం సినిమాను ఎలా తెరకెక్కించామో, ఎంత రిస్క్ తీసుకున్నామో డైరెక్టర్ అజయ్ భూపతితోపాటు ఇతర ఆర్టిస్ట్ లు ఈ వీడియోలో వివరించారు. అందులో భాగంగా కొన్ని సీన్లను ఎంత రిస్క్ చేసి తీశారో కూడా మేకర్స్ ఆ వీడియో ద్వారా తెలియజేశారు..నీళ్లలో కొట్టుకుపోతున్న సీన్ తీయడానికి కెమెరామ్యాన్ కూడా బ్రిడ్జ్ పై నుంచి నీళ్లలోకి దూకడం, పొలంలో మంటల మధ్య ఆర్టిస్టులు పరుగెత్తుతున్న సీన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పాయల్ రాజ్‌పుత్ కూడా తన అనుభవాలను పంచుకుంది. తెలుగులో ఇంత వరకూ ఇలాంటి థ్రిల్లర్ మూవీ రాలేదని డైరెక్టర్ అజయ్ భూపతితోపాటు పాయల్ కూడా చెప్పుకొచ్చింది..

అజయ్ నాకు కథ చెప్పే విధానమే చాలా కొత్తగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.గతంలో అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మూవీలో పాయల్ హాట్ సీన్లలో రెచ్చిపోయింది. ఈ సినిమాలో ఓ గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తోంది. అయితే మంగళవారం మూవీ నుంచి గతంలో వచ్చిన పోస్టర్లలో పాయల్ ఒంటి పైభాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా బ్యాక్ మొత్తం కనిపించేలా ఉన్న పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించే ఉద్దేశంతో తాము సినిమాలో చాలా రిస్కీ షాట్లు చేశామని, సినిమాటోగ్రఫీ మరో లెవల్లో ఉంటుందని డైరెక్టర్ అజయ్ భూపతి ఈ వీడియోలో చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఉన్న గణగణ మోగాలిరా పాట 400 షాట్ల కలయిక అని ఈ పాట థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.స్వాతి రెడ్డి గునుపాటి మరియు సురేశ్ వర్మ కలిసి ముద్ర మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో మంగళవారం సినిమా నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది

Show comments