Manchu Vishnu: ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఘటన రష్మిక డీప్ ఫేక్ వీడియో. AI టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ఫేస్ తో ఒక వల్గర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రష్మికకు సపోర్ట్ గా చిత్ర పరిశ్రమ మొత్తం కదిలివచ్చింది. అమితాబ్ బచ్చన్ నుంచి విజయ్ దేవరకొండ వరకు అందరూ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇక తాజాగా ఈ వీడియోపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించాడు. తన పూర్తి సపోర్ట్ రష్మికకు ఉంటుంది అని చెప్తూ ట్వీట్ చేశాడు. ” డీప్ ఫేక్ కాంట్రవర్సీ వీడియోకు గురైన చాలా మంది బాధితుల్లో ఒకరైన రష్మికకు నేను గట్టిగా మద్దతు ఇస్తున్నాను. మేము, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)లో, ఇటువంటి హానికరమైన కంటెంట్‌ను రూపొందిస్తూ సాంకేతికతను దుర్వినియోగం చేయడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి..? ఎలా పరిష్కరించాలి..? అనే దానిపై సమగ్ర మార్గదర్శకాలను అభివృద్ధి చేయడానికి MAA లీగల్ గా AI నిపుణులకు ఎప్పుడు సహకరిస్తుంది.
Vijay Devarakonda : రష్మిక డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన విజయ్ దేవరకొండ..
రష్మిక కేసు ఈ ఆందోళనలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఏఐ టెక్నాలజీ సాయంతో నటీనటుల రక్షణకు భంగం కలిగించే ఇలాంటి వీడియోలను మా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. పొరుగు రాష్ట్రాల్లోని సంఘాలను కూడా సంప్రదించి దీనిపై చర్చించడం జరిగింది. మా పరిశ్రమ నిపుణుల శ్రేయస్సు మరియు గౌరవాన్ని కాపాడటానికి మేము అంకితభావంతో ఉన్నాము” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
I strongly support Rashmika, who is one of the many victims of the deep fake controversy video. We at , Movie Artiste Association (MAA) , are deeply concerned about the misuse of technology to create such harmful content. MAA is actively collaborating with legal and AI experts to…
— Vishnu Manchu (@iVishnuManchu) November 8, 2023