Manchu Vishnu: మంచు విష్ణు, పాయ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధా పాత్రలుగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జిన్నా. మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ – స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు విష్ణు, సన్నీని టీజ్ చేశాడు.
సన్నీ మాట్లాడుతూ” ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇప్పటివరకు తెలుగు లో ఇంత పెద్ద పాత్ర చేయలేదు. కథ నాకు బాగా నచ్చింది. మోహన్ బాబు సర్, మంచు విష్ణు ఎంతో సపోర్ట్ చేశారు. మంచు విష్ణు చాలా మంచి వ్యక్తి అని చెప్తుండగా విష్ణు.. ఇప్పుడు నీకు ముద్దు పెట్టనా..? అని అడిగేశాడు. అందుకు సన్నీ నో.. తను ఎప్పుడు ఇంతే.. వెరీ నాటీ విష్ణు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఓ మంచు అన్న వెరీ నాటీ అని కొందరు.. మా ప్రెసిడెంట్ మంచి ఫార్మ్ లో ఉన్నాడే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. చాలా గ్యాప్ తరువాత వస్తున్నా మంచు విష్ణు ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి.
