NTV Telugu Site icon

Manchu Vishnu: మా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం.. అది చేయలేకనేనా.. ?

Vishnu

Vishnu

Manchu Vishnu:మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. గతేడాది జరిగిన మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానెల్ ఎంతటి రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను ఓడించడానికి మంచు విష్ణు ఎంత కష్టపడ్డాడో అందరికి తెల్సిందే. ఇక ఎన్నికల ముందు ఎన్ని హామీలు అయితే చేశాడో.. ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తాను ప్రెసిడెంట్ అయ్యాక మా బిల్డింగ్ ను నిర్మిస్తామని చెప్పుకొచ్చాడు. కానీ, విష్ణు ప్రెసిడెంట్ గా సంతకం చేసి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు ఆ బిల్డింగ్ మాట కూడా ఎత్తలేదు. ఇక విష్ణుకు సపోర్ట్ గా నిలబడిన నరేష్ సైతం.. మా బిల్డింగ్ గురించి నన్ను అడగకండి.. విష్ణును అడగండి అని చెప్పేశాడు. దీంతో అందరూ విష్ణునే ప్రశ్నిస్తున్నారు.

Dil Raju: ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన దిల్ రాజు..

ఇక ఇప్పటివరకు ఆ హామీలను నిలబెట్టుకోలేకపోయిన విష్ణు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది. అదేంటంటే.. వచ్చే మా ఎలక్షన్స్ నుంచి మంచు విష్ణు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడట. ఇంకా మా ఎలక్షన్స్ కు సమయం ఉండడంతో ఆలోపు తాను నెరవేరుస్తాను అని చెప్పిన హామీలను అన్ని నెరవేర్చడానికి కృషి చేస్తాడట. అంతేకాకుండా మా బిల్డింగ్ విషయంలో కూడా విష్ణు ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇందులో ఎలాంటి నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు మా ప్రెసిడెంట్ గా నిలబడతారు అనేది ఆసక్తిగా మారింది.

Show comments