NTV Telugu Site icon

Manchu Vishnu: బిగ్ బ్రేకింగ్.. కన్నప్ప షూటింగ్ లో మంచు విష్ణుకు ప్రమాదం

Manchu Vishnu

Manchu Vishnu

Manchu Vishnu: మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మంచు విష్ణు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలను, నటులను దింపేశాడు. ప్రభాస్, అనుష్క, మోహన్ లాల్, శివన్న లాంటి స్టార్స్ నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

T.Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

ఇక ఈ నేపథ్యంలోనే సెట్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మంచి విష్ణు తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం అందుతుంది. కన్నప్ప షూటింగ్ లో ఉండగా డ్రోన్ కెమెరా అదుపు తప్పి విష్ణు మీదకి దూసుకురావడంతో చేతికి పలు గాయాలు అయ్యాయని సమాచారం. వెంటనే విష్ణును దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గాయాలే అయినా కూడా వైద్యులు విష్ణును రెస్ట్ తీసుకోమన్నారని, అందుకే షూటింగ్ ను చిత్రబృందం నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో మంచి విష్ణు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.