ప్రస్తుతం టాలీవుడ్ లో ఏం జరుగుతుందో ఎవరికి అంతు పట్టడం లేదు. ఇండస్ట్రీ ముద్దు బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం వెతికే దిశలో సీఎం జగన్ ని కలిసి చర్చలు జరిపారు. చిరుకు తోడుగా సినీ ప్రముఖులు కూడా ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. అయితే ఈ మీటింగ్ కి మంచు ఫ్యామిలీ కి ఆహ్వానం అందకపోవడంతో వారు కొంచెం అసహనమ్ వ్యక్తం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మంచు ఫ్యామిలీ ఏకంగా మంత్ర్రి పేర్ని నాని నే ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చి అందరిని షాక్ కి గురిచేశారు. ఇక తాజాగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, సీఎం జగన్ తో భేటీ కానున్నారు. మా ప్రెసిడెంట్ గా గెలిచాక మొదటి సారి సీఎం జగన్ ని కలవనున్నారు మంచు విష్ణు. అయితే ఈ మీటింగ్ వెనుక కారణం కూడా లేకపోలేదని వార్తలు వస్తున్నాయి. ఇ
ఇటీవల మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంత్రి నాని చర్చల్లో భాగంగా తమకు ఆహ్వానం అందలేదని మంచు ఫ్యామిలీ అసహనం వ్యక్తం చేసినట్లు జగన్ కి చెప్పడంతో ఆయన ఈరోజు మంచు విష్ణును కలవడానికి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. లంచ్ మీట్ లో విష్ణు, జగన్ ని కలవనున్నారు. ఈ సమావేశంలో విష్ణు.. సినిమా టికెట్ వివాదం గురించి, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనల గురించి, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సహా పలు ఇతర అంశాలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సమావేశం అనంతరం మంచు విష్ణు స్పందన ఏంటో తెలియాల్సి ఉంది.
