Site icon NTV Telugu

వీడియో: ‘మా’ భవనం కోసం స్థలాన్ని వెతికిన మంచు విష్ణు

Vishnu Manchu

మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. కాగా ఇప్పటికే, లోకల్-నాన్ లోకల్, మా నిధులు, మా శాశ్వత భవనం అంటూ ఒకరిపై ఒకరు పోటీదారులు ఆరోపణలు చేసుకోవడంతో వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ట్విటర్ ద్వారా వీడియో సందేశం ఇస్తూ.. త్వరలోనే ‘మా’ శాశ్వత భవనం కల నెరవేరనుందని చెప్పుకొచ్చారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించామని విష్ణు తెలిపారు. ఆ మూడు స్థలాల్లోను ఒకటి అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు ప్రస్తుతం ‘మా’ భవనం అత్యవసరం కాదని ప్రకాష్ రాజ్ ప్యానల్ అభిప్రాయపడుతోంది. ‘మా’బిల్డింగ్‌ నిర్మాణం కోసం ఖర్చు చేసే డబ్బుతో పేద కళాకారులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే బాగుంటుందని ప్రకాష్ రాజ్ మద్దతుదారుడు బండ్ల గణేష్ రీసెంట్ గా చెప్పుకొచ్చారు.

Exit mobile version