Site icon NTV Telugu

Manchu Vishnu: ”మా’ ప్రెసిడెంట్ కు బాత్రూమ్ లేదా.. నడిరోడ్డుపై ఏంటీ ఇలా’

Manchu Vishnu

Manchu Vishnu

Manchu Vishnu: సోషల్ మీడియా వచ్చాకా నెటిజన్స్ కు ఎలాంటి మాటలు అయినా మాట్లాడే దైర్యం వచ్చేసింది. మొహమాటం లేకుండా ఏది అనిపిస్తే అది అనేస్తున్నారు. ముఖ్యంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ని ట్రోల్ చేయడంలో ట్రోలర్స్ ఎప్పుడు ముందు ఉంటారు. అయితే మంచు ఫ్యామిలీ మాత్రం ఇలాంటి ట్రోలర్స్ ను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. ఇక మా ఎన్నికలప్పుడు మంచి విష్ణును ఏ విధంగా నెటిజన్లు ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరోసారి నెటిజన్స్ కు ట్రోల్ కంటెంట్ ఇచ్చాడు మంచి విష్ణు. ప్రస్తుతం జిన్నా సినిమాలో నటిస్తున్న విష్ణు ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో విష్ణు రోడ్డుపై కూర్చొని కనిపించాడు. అయితే ఈ పోజ్ కాస్తా డిఫరెంట్ గా ఉండడంతో నెటిజన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఏంటన్నా బాత్రూమ్ లేదా.. నడిరోడ్డుపై ఇలా చేస్తున్నావ్ అని కొందరు.. చెంబు ఒక్కటి తక్కువ అయ్యిందని మరికొందరు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోటోను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఎడిట్స్ చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమనే చెప్పాలి. విష్ణు ముందు బకెట్, చెంబు పెట్టినవి అయితే నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక మరికొందరు అయితే విష్ణు ఫోటోలు పెట్టుకొనేటప్పుడు ట్రోల్ చేస్తారని తెలుసు కదా.. చూసుకోవాలి కదా అంటూ హితబోధ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version