NTV Telugu Site icon

Manchu Vishnu : ప్రభాస్ ఆ పనిచేస్తే నేను కన్నప్ప చేసేవాడిని కాదు : మంచు విష్ణు

Manchu Vishnu

Manchu Vishnu

Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో ట్రోలింగ్ వచ్చినా ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వాళ్లు కీలక పాత్రలు చేయడం మరో విషయం. ఇక మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ కన్నప్ప సినిమాను తిన్నడు స్టోరీ నుంచి తీసుకున్నామన్నారు. నాస్తికుడు అయిన తిన్నడు చివరకు శివభక్తుడిగా ఎలా మారుతాడు అని చెప్పే సీన్లతో కన్నప్పను తీశామన్నారు.

Read Also : CM Revanth Reddy: ఆన్ లైన్ బెట్టింగ్ పై సీఎం రేవంత్ సీరియస్..

‘ఈ సినిమా తీసేటప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదు. కానీ కన్నప్ప పాత్ర శివలింగాన్ని తాకే ప్రతి సీన్ సమయంలో నేను నేల మీదనే పడుకున్నాను. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాం. ఒకవేళ ప్రభాస్ తాను కన్నప్ప సినిమాను చేస్తానని ముందే చెబితే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు. కృష్ణంరాజు ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటాయి’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.