Ginna Trailer: మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్‌బాబు సమర్పణలో కోన వెంకట్ కథను అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ భామలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుకగా రిలీజ్ కావల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన అక్టోబర్ 21 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. “జిన్నా యాడున్నాడురా.. రెండు మాసాలు అయ్యి ఉండాది వడ్డీ కట్టి”అని విలన్ బేస్ వాయిస్ తో డైలాగ్ వస్తుండగా మంచి విష్ణు ఎంట్రీ షాట్స్ అదిరిపోయాయి. ఒక సాదా సీదా టెంట్ హౌస్ ఓనర్ .. డబ్బు కోసం కష్టాలు పడుతుండగా అనుకోకుండా ఒక దెయ్యం చేతిలో ఇరుక్కోవడం.. డబ్బు కోసం వెళ్లిన అతను తన ప్రేమించినవాళ్లను కాపాడుకోవడం కోసం దెయ్యంతోనే యుద్ధం చేయడం లాంటివి వినోదాత్మకంగా చూపించారు. మరి చివరికి విష్ణు ఆ దెయ్యాన్ని కనిపెట్టాడా..? అసలు ఆ దెయ్యం ఎవ్వరు..? ఆమెకు, సన్నీ లియోన్ కు సంబంధం ఏంటి..? ఇక పాయల్, విష్ణు ప్రేమ మధ్యలో ఆమె ఎందుకు వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైల్ లో మొత్తం విష్ణు ను ఎలివేట్ చేసే సీన్సే ఎక్కువ ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.
విష్ణు గురించి చెప్పడానికే సద్దాం పాత్ర పెట్టినట్లు ఉంది. ‘జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా. లోడ్ చేసిన గన్.. టచ్ చేస్తే దీపావళే’డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు లాంటి స్టార్ కమెడియన్స్ అందరు ఈ సినిమాలో ఉన్నారు. ఇక సన్నీ అందాల విందు సినిమాకు హైలైట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి జిన్నా సినిమా హారర్ కామెడీ సినిమా అని ట్రైలర్ తో చెప్పేశారు. మరి ఈ సినిమా విష్ణుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
