Site icon NTV Telugu

Ginna: ఎట్టకేలకు ఓటిటీ డేట్ ఫిక్స్ చేసుకున్న జిన్నా.. ట్రోలర్స్ కు పండగే

Jinna

Jinna

Ginna: మంచు ఫ్యామిలీ అంటే ట్రోలింగ్ కు కేరాఫ్ అడ్రెస్స్. అదేం విచిత్రమో వారు ఏం చేసినా నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇటీవల మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తో కలిసి కోన వెంకట్ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ భామలు సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఒక మహిళ జంబలకిడి జారు మిఠాయ పాట పాడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 21 న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని చవిచూసింది. సినిమా బావుంది అన్నా కూడా కొన్ని ట్రోల్స్ వలన ఆడలేకపయింది అనేది కొందరి మాట.

సరే థియేటర్ లో పోతే పోయింది ఓటిటీలోనైనా చూద్దాం అనుకునేవారికి ఇప్పటివరకు నిరాశే మిగిలింది. అసలు ఈ సినిమాను ఏ ఓటిటీ కొన్నది.. ఎప్పుడు స్ట్రీమ్ చేస్తోంది అనేది మేకర్స్ చెప్పకపోవడంతో ఈ సినిమా ఓటిటీలోకి వచ్చే అవకాశం లేదేమోఅని అనుకున్నారు. కానీ, ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జిన్నా సినిమాను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. డిసెంబర్ 2 అనగా రేపటి నుంచి జిన్నా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయం తెలియడంతో ట్రోలర్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇంకొన్నిరోజులు ఈ సినిమాను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా ట్రెండ్ సృష్టిస్తారు అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి థియేటర్ లో చప్పుడు చేయని మా ప్రెసిడెంట్ గారు ఓటిటీలోనైనా సౌండ్ చేస్తారేమో చూడాలి.

Exit mobile version